calender_icon.png 5 January, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల రైతుల ముందస్తు బెయిలు పిటిషన్

03-01-2025 01:41:00 AM

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ఇతర ప్రభుత్వాధికారులపై దాడి చేశారంటూ బొమ్మరాసిపేట్ పోలీసులు పెట్టిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ 12 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. డీడీ పవార్ నాయక్ సహా 12 మంది రైతులు వేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.

కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బొమ్మరాసిపేట్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. ఫార్మాసిటీకి భూసేకరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు గత నవంబరు 11న కేసు నమోదు చేశారు.

నిందితులుగా ఉన్న పవార్ నాయక్ సహా 12 మంది రైతుల తరఫున న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్లు ఎవరిమీద దాడి చేయలేదని, అన్యాయంగా కేసు నమోదు చేశారని చెప్పారు.