calender_icon.png 24 December, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నంకు షరతులతో ముందస్తు బెయిలు

24-12-2024 12:48:53 AM

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకో ర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఫార్మాసిటీ భూసేకరణ వ్యవ హారంలో అధికారులపై దాడికి సంబంధించి బొమ్రాసుపేట పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో షరతులతో కూడిన ముందస్తు బెయిలు ఇచ్చింది.

ఫార్మాసిటీ భూసేకరణకు వెళుతున్న అధికారులను అడ్డగించి, దాడి చేశారంటూ కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ ఫిర్యాదులో తన పేరు లేకపోయినప్పటికీ భవిష్యత్తులో పోలీసులు చేర్చి అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ నరేందర్‌రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు.

దీనిని సోమవా రం విచారించిన జస్టిస్ కే లక్ష్మణ్.. షరతులతో ముందస్తు బెయిలు మంజూ రు చేశారు. రూ.25 వేల చొప్పున వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి సోమవా రం పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని, విచారణకు సహకరించాలని షర తులు విధించారు. పిటిషన్లపై విచారణను మూసివేశారు.