calender_icon.png 31 October, 2024 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్షసాయికి ముందస్తు బెయిల్

31-10-2024 01:46:08 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 30: యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయి తనపై లైంగిక దాడి చేశాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి రూ. 2 కోట్లు తీసుకున్నాడని తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒకరు ఆయనపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు పరారీలో ఉన్నాడు. తనపై ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో హర్షసాయి న్యాయవాది  ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, కోర్టు మంజూరు చేసింది.