calender_icon.png 13 March, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి

13-03-2025 01:35:29 AM

ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ -మహారాష్ర్ట సరిహద్దులో ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు సిబ్బందికి సూచించారు.

జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలను స్వీకరించిన ఎస్పీ తనదైన శైలిలో జిల్లాలో ఆకస్మిక పర్యటనలతో పోలీసు యంత్రాంగం విధులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే జైనథ్ మండలంలో బుధవారం పర్యటించారు. ముందుగా సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం జైనథ్ పోలీస్ స్టేషన్‌ను, సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతాలు పెన్ గంగ, బోరజ్, పిప్పర్‌వాడ ప్రాంతాలను పరిశీలించారు.