calender_icon.png 27 March, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాబాల్లో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలి...

22-03-2025 10:15:51 PM

పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహాజన్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాలలో మద్యం సేవించడం, ఇతరత్రా  అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఇచ్చోడ, నేరడిగొండ, సిరికొండ మండలాల పోలీస్ స్టేషన్లను శనివారం ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి, పలు అంశాలపై అరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాలపై కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తూ, ఇంజనీరింగ్ తప్పిదం ఉన్న ప్రదేశాలలో సైన్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, జిగ్జాగ్ పద్ధతిని ఆవలంబిస్తూ ప్రమదాలను అరికట్టాలని తెలిపారు. ఎలాంటి మత్తు పదార్థాలను, గంజాయి పండించడం సేవించడం లాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సైలు తిరుపతి, శ్రీకాంత్, శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.