14-03-2025 05:00:45 PM
మంథని,(విజయక్రాంతి): అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిర్మాణం లో ఉన్న అంబేద్కర్ భవనం నిలుస్తుంది. మండలలోని చిల్లపల్లె గ్రామం వద్ద గత 20 సంవత్సరాల క్రితం సింగరేణి సేపు నిధులతో ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం ఇప్పటివరకు పూర్తికాలేదని దళితులు వాపోతున్నారు. అసంపూర్తిగా ఉన్న ఈ భవనంలో కొంతమంది అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. చిల్లపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవనం మంథని ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు 2021 సంవత్సరంలో సింగరేణి సేఫ్ నిధుల కింద మూడు లక్షలు మంజూరు చేశారు. కానీ ఇక్కడున్న పాలకులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. దళిత సంఘాలు కానీ వారికి సంబంధించిన వారు అంబేద్కర్ భవనం గురించి మాత్రం పట్టించుకున్న నాథుడు లేడని దళితులు వాపోతున్నారు. ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని రాబోయే అంబేద్కర్ జయంతి లోపు భవనం పూర్తి చేసి ప్రారంభం చేయవలసిందిగా దళితులు కోరుతున్నారు.