- సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలి..
- ‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి..
- జగిత్యాల నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): దేశచరిత్రలో అధికార పగ్గాలు చేపట్టిన పది నెలల్లోనే ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సర్కార్ తెలంగా ణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం వివిధ బీసీ సంఘాల నేతలు, జగిత్యాల నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడా రు.
జగిత్యాలకు, తనకు ఆత్మయ అనుబం ధం ఉందని, పార్టీలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణ జగిత్యాల నియోజకవర్గమని కొనియాడారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ నుం చి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లారని, వెళ్లేముందు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చా రు. ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్ వాట్సాప్ గ్రూప్‌లు ఉండాలని, అవసరమైనంత సోష ల్ మీడియాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయంలో ప్రజలకు జరిగినే మేలును ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలైన కరెంటు కోతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
రైతు భరోసా, మహిళలకు నెలకు రూ.2,500 వంటి పథకాలు అమలు చేయకపోవడంపై సర్కార్‌ను నిలదీయాలన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు తీసుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో మెజారిటీ పంచాయతీలు సాధించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమె బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. సోమవారం నాయకులతో కలిసి బీసీ కమిషన్‌కు నివేదిక సమ ర్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని, జనాభా ప్రకారం వారి వాటా దక్కాల్సిందేనన్నారు. సమావేశా ల్లో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచా రి, నాయకులు గట్టు రాంచందర్‌రావు, బొల్లా శివశంకర్ , హరి, ఉపేంద ర్, భిక్షపతి, రాజారాం యాదవ్, సురేశ్ పాల్గొన్నారు.