నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో అధికారంలో ఉన్న మోడి ప్రభుత్వం కార్మిక,రైతు వ్యతిరేక విధానాలు వెంటనే విడనాడాలని కార్మిక సంఘాల నేతలు డింమాండ్ చేశారు. మంగళవారం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరశిస్తూ నిర్మల్‌లో ర్యాలి నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. మోడి ప్రభుత్వం ప్రజలకు రైతులకు, కార్మికులకు మోసం చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను బలహీన పరిచి సంపన్నులకు కోమ్ము కాసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సిగ్గు చేటు అన్నారు. ప్రభుత్వం తన వైకరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న, నూతన్‌కుమార్, ఎస్‌ఎన్ రెడ్డి.రాజు, హరిత, మైమూద్, బక్కన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.