calender_icon.png 26 October, 2024 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత వ్యతిరేకులు దేశాన్ని పాలిస్తున్నారు

10-08-2024 12:29:03 AM

బ్రిటిషోళ్ల తరహాలోనే కులం, మతాల మధ్య చిచ్చు

వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిగా కూర్చోబెడుతారు 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారని, బ్రిటీష్ మాదిరిగానే ఈనాటి పాలకులు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. దేశంలోని ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లా కలిసి ఉండా లని రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు. క్విట్ ఇండియా దినోత్స వం సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ జెండాను జగ్గారెడ్డి  ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. గాంధీ కుటుం బాన్ని రాజకీయంగా లేకుండా చేయాలని ప్రధాని మోదీ కుట్ర చేశారని ఆరోపించారు.

కానీ ప్రజలు ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టారని, వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా నిలబెడతారని జగారెడ్డి అభిప్రా యపడ్డారు. రాహుల్, సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే అడుగుజాడల్లో పని చేద్దా మని పార్టీ క్యాడర్‌కు జగ్గారెడ్డి పిలుపు నిచ్చారు. దేశంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే గాంధీ మొదలు పెట్టిన క్విట్ ఇండియా ఉద్యమమే కారణ మన్నారు. 1942లో మొదలు పెట్టిన క్విట్ ఇండియా ఉద్యమంతోనే దేశానికి స్వాతం త్య్రం వచ్చిందన్నారు. 200 ఏళ్లు బ్రిటీష్ పాలనలో జరిగిన హింసకు వేలాది మంది బలయ్యారని, కానీ, అహింసామార్గంలో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం మొదలు పెట్టారని గుర్తుచేశారు.

గాంధీ చిత్రపటాన్ని కరెన్సీ నోటు మీద లేకుండా మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పీసీసీ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ నేతృత్వంలో గాంధీభవన్ నుంచి గన్‌పార్కు వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజ న్, పార్టీ సీనియర్ నేత జెట్టి కుసుమకు మార్, సేవాదళ్ ఇన్‌చార్జ్ వినోద్ కొలప్కార్, అబుల్ సమ్మద్, మహిళా కాంగ్రెస్ నాయకు లు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.