* ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టిక్కెట్ ఇవ్వాలి
* బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాయని.. వెంటనే తీరు మార్చు తగిన గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. బీసీ సంఘాల నేతలతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడుతూ.
. జనా దామాషా ప్రకారం అత్యధిక ఓటు బ్యాం ఉన్న బీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటికే బీ అగ్రకుల రెడ్డి అభ్యర్థికి సీటు ప్రకటించిందని.. అదే బాటలో కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్లకు టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతు చ్‌మ్నూయ చ్‌మ్నూరు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇప్పటికే ఉపాధ్యా సంఘాలైన పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీయస్ తదితర సంఘాలు అగ్రకుల రెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయాని.. ఇది పూర్తిగా బీసీలను విస్మరించడమే అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలుే బీసీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై త్వరలో హైదరాబాద్‌లో బీసీ మేధావులు, బీసీ సంఘాలు, కుల సంఘాలతో సమావేశం నిర్వహించి చర్చిస్తామన్నారు. సమావేశంలో బీసీ కుల సం జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, రాష్ర్ట కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు బీ మణిమంజరి సాగర్, ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం తదితరులు పాల్గొన్నారు.