calender_icon.png 4 December, 2024 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి అంతంపల్లి వాసి మృతి

04-11-2024 10:46:29 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే... కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన జీడి సిద్దయ్య(58) ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడ్డాడు. ఈ ప్రమాదంలో సిద్దయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని సిద్ధయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సిద్దయ్య అంతంపల్లి నుంచి బిక్కనూరులో రైలు ఎక్కి తన సోదరుని ఇంటికి  వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.