calender_icon.png 15 January, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్షుమన్ సేవలు గుర్తుండిపోతాయి

02-08-2024 12:05:07 AM

వడోదర: భారత జట్టు మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. అన్షుమన్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. అన్షుమన్ లేడనే వార్త తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. 71 సంవత్సరాల వయసులో మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన 1974 87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టు లు, 15 వన్డేలు ఆడి మొత్తం 2254 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

అంతే కాకుం డా అన్షుమన్ రెండు సార్లు టీమిండియాకు ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించాడు. కోచ్‌గా మాత్రమే కాకుండా గైక్వాడ్ జాతీ య టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. గైక్వాడ్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కింద రూ. కోటి అందించాలని బీసీసీఐ నిర్ణయించిన కొద్ది రోజులకే ఇలా జరిగిపో యింది. బీసీసీఐ కార్యదర్శి జైషాతో పాటు మాజీ కెప్టెన్ గంగూలీ కూడా అన్షుమన్ మృతి పట్ల సంతాపం తెలిపారు.