calender_icon.png 24 September, 2024 | 8:52 AM

చిరంజీవికి ఏఎన్‌ఆర్ అవార్డు

21-09-2024 12:40:00 AM

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్‌ఎఫ్‌డీసీ-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్‌ఆర్100 ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్‌ఆర్ ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏఎన్‌ఆర్ ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తం గా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4కేలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “నాన్న మాకు నవ్వుతూ బతకడం నేర్పించారు.

అలాంటి వ్యక్తి వందేళ్ల జయంత్యోత్సవాలను 31 సిటీల్లో చేస్తున్నామని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ శత జయంతి రోజు నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రతి రెండేళ్లకు ఏఎన్‌ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది అవార్డ్ చిరంజీవికి ఇవ్వాలకున్నాం. అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 28 ఈ అవార్డ్ ప్రదానం చేస్తారు’ అని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కే రాఘవేందర్‌రావు, సీనియర్ నటుడు మురళీమోహన్, వెంకట్ అక్కినేని, శివేంద్ర సింగ్ దుంగార్పూర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జాయింట్ కలెక్టర్ సంజయ్, పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి, అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.