11-04-2025 12:25:06 AM
న్యూయార్క్, ఏప్రిల్ 10: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉ న్నారు. ఇప్పటికే అక్రమ వలసదారుల విషయంలో కఠిన వైఖరి అను సరిస్తోన్న అమెరికా ప్రభుత్వం తాజా గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినట్టు తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు మం జూరే చేయబోమంటూ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్‌కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతున్నామని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది.
ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్న హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనా న్ హెజ్‌బొల్లా, యెమెన్, హైతీ వంటి గ్రూప్‌లకు మద్దతు ఇస్తే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా వాటి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉం టుందని హెచ్చరించింది.