calender_icon.png 7 February, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజదొంగ బత్తుల ప్రభాకర్ కేసులో మరో ట్విస్ట్

07-02-2025 12:00:00 AM

  • అతని స్నేహితుడు రంజిత్ అరెస్ట్ వెపన్స్ కొనుగోలులో కీలక 
  • సూత్రధారి అన్షు కోసం పోలీసుల గాలింపు

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): తీగ లాగితే డొంక అంత కదిలినట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ విషయంలో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత కాలం అతనికి ఆశ్రయం ఇచ్చింది మొదలు ఆర్థిక లావాదేవీలు ఎక్కడినుంచి నడిపారు అనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ప్రిజం పబ్ వద్ద పోలీసులపై ఫైరింగ్ కు దిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.  గత శనివారం ప్రిజం పబ్బు వద్ద బత్తుల ప్రభాకర్ ను స్కోడా కారులో డ్రాప్ చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రంజిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. బత్తుల ప్రభాకర్ కు సంబంధించిన పలు కీలక విషయాలను రాబట్టారు.

రంజిత్ 2023 నుండి ప్రభాకర్ తో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు.ప్రభాకర్ కు ఆశ్రయం కల్పించడంతో పాటు బ్యాంకు లావాదేవీ లలో తోడ్పాటు అందించినట్లు తెల్సింది. అంతేకాకుండా ప్రభాకర్ బీహార్ లో వెపన్స్ కొనుగోలు చేసి తీసుకురావడంలో కూడా రంజిత్ సహకరించినట్లు గుర్తించారు.

బీహార్‌లో ఆయుధాలు కొనుగోలు చేసేం దుకు ప్రభాకర్ తో పాటు  రంజిత్ వెళ్లాడని తేల్చారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బులను రంజిత్ బ్యాంకు ఖాతాలో వేసుకుని వ్యవహా రాలు చక్కబెట్టేవాడు. ఆర్థిక లావాదేవీలన్నీ రంజిత్ అకౌంట్స్ నుంచే జరిగేవి. దీంతో ఈ కేసులో రంజిత్ ను A2గా చేర్చి  గచ్చిబౌలి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

రంజిత్ తో పాటు బీహార్‌లో ఆశ్రయం కల్పించి ఆయు ధాలు కొనుగోలు చేసేందుకు సహకరించిన మరో మిత్రుడు రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

వెపన్స్ కొనుగోలులో కీలక సూత్రధారిగా ఉన్న బీహార్ కు చెందిన అన్షు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అలాగే గజదొంగ బత్తుల ప్రభాకర్ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నా యి. ఎక్కడెక్కడ తిరిగాడు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.