calender_icon.png 24 December, 2024 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్

10-07-2024 03:36:03 PM

హైదరాబాద్: 'ఉయ్యాల జంపాలా', 'కుమారి 21 ఎఫ్' వంటి చిత్రాలతో పేరుగాంచిన తెలుగు నటుడు రాజ్ తరుణ్‌పై లావణ్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య రెండోసారి ఫిర్యాదు చేసింది. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారమే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ పై ఐపీసీ 420, 506,493 సెక్షన్ల కింద మూడు కేసులు బుక్ చేశారు. పెళ్లి చేసుకుని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు ఫిలింనగర్ లో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాజ్ తరుణ్ తన రాబోయే చిత్రం 'తిరగబడరా సామి' కోసం సిద్ధమవుతున్నాడు.