calender_icon.png 19 January, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్‌లో మరో ఉగ్రఘాతుకం

25-07-2024 01:34:51 AM

24 గంటల్లోనే ఇద్దరు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

శ్రీనగర్, జూలై 24: కశ్మీర్ లోయ మరోమారు రక్తమోడింది.  ఉగ్రవాదుల కాల్పుల్లో 24 గంటల్లో ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. మన సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారాలో ఇండియన్ ఆర్మీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహిస్తుంటే జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు చనిపోయాడు. చనిపోయిన సైనికుడు నాన్ కమిషనర్ ఆఫీసర్. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్ట్ కూడా చనిపోయాడు. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ సరిహద్దును దాటి కొంత మంది ఉగ్రవాదులు ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఓ సైనికుడు వీరమరణం పొందగా.. ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులతో కలిసి కుప్వారా జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ చేయగా.. ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా జమ్మూలో ఉగ్రదాడులు పెరుగుతుండడం అందరినీ కలవరానికి గురి చేస్తోంది.