31-03-2025 01:09:05 AM
ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది
గాంధీభవన్ ఉగాది వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ఉగాది వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోపాటు పార్టీకి చెంది న పలువురు నేతలు హాజరయ్యారు.
ఈసందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ పేదల దేవాలయం లాంటిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సీఎం రేవం త్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పా టు మంత్రులు ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పా రు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పటిష్టంగా ఉం దన్నారు. మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమావ్యక్తం చేశారు. విశ్వావసు నామ సంవ త్స రంలో రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాల ని, ప్రజలకు సంక్షే మ ఫలితాలు అందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మె ట్టు సాయికుమార్, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి, కిషన్, కుమార్‌రావు పాల్గొన్నారు.
వర్షాలు ఆలస్యంగా పడుతాయి.. పంచాంగ శ్రవణంలో పండితులు శ్రీనివాసమూర్తి
ఉగాది వేడుకల్లో భాగంగా గాంధీభవన్‌లో పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం పేరుతో ప్రారంభమైందని తెలిపారు. కొన్ని మండలాల్లో అతివృష్టి, మరికొ న్ని మండలాలో అనావృష్టి ఉంటుందన్నారు. వర్షాలు ఆలస్యంగా పడే అవ కాశం ఉంటుందని చెప్పారు.