* ఆలయం రూఫ్ నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ ఆలయంపై దాడి జరిగింది. ఢాకాలోని తురాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నామ్‌హట్టాలోని ఇస్కాన్ ఆలయానికి దుండగులు నిప్పంటించారని కోల్‌కతా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ వెల్లడించారు. ఘటనలో ఇస్కాన్ కేంద్రంలోని అన్నీ విగ్రహాలు ధ్వంసమయినట్లు దాస్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల మధ్య ఈ ఘటన జరిగి నట్లు సమాచారం.
ఆలయం వెనుక ఉన్న రూఫ్‌ని పైకి తీసి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిసింది. బంగ్లాలో హిం దువులపై జరుగుతున్న దాడులను ఖండి స్తూ ఇస్కాన్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లా ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. మరికొందరు ఇస్కాన్ ప్రచారకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుంచి మైనార్టీలపై హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆలయ నిర్మాణంపై వార్నింగ్
బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడి, అక్కడి తాజాగా ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అసోంలో బంగ్లా సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పున రుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసోంలోని శ్రీభూమి జిల్లాలో భారత్ సరిహద్దు వెంట కుషియారా నది సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుం ది.
కుషియారాలో నిమజ్జన ఘాట్‌లో ఉన్న మానస ఆలయ పునరుద్ధరణకు స్థానిక ప్రభుత్వం 3 లక్షలు కేటాయించింది. పనులు కొనసాగుతున్న క్రమంలో బంగ్లాదేశ్ జకింగంజ్ సరిహద్దు అవుట్ పోస్ట్‌కు చెందిన కొంతమంది సిబ్బంది స్పీడ్ బోట్‌లో భారత సరిహద్దుల్లోకి వచ్చి, ఆలయ పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న కార్మికులను భయపెట్టారు. వెంటనే నిర్మాణాన్ని ఆపాలని, లేకుంటే కాల్పులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక హిందువులను కూడా బెదిరించినట్లు తెలిసింది. నమాజ్ తర్వాత లేదా మసీదు నుంచి ఈ ఆలయాన్ని చూడటం హరామ్ అని వారు పేర్కొన్నట్లు తెలిసింది.