ఇప్పటికే పెరిగిన భూమి రిజిస్ట్రేషన్ల భారాలతో ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ భూముల ధరలు ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు వార్తలు చదువుతున్నాం. ఇప్పటికి పన్నులు లేని సేవలపై స్టాంపు డ్యూటీ వేయడం సబబు కావచ్చు. కానీ, ఉన్నవాటిపై మరింతగా పెంచడం సరైన పద్ధతి కాదు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారమే అవుతుంది. ఇతర సేవలకు కార్పొరేట్ కంపెనీలకు లేదా విదేశీ కంపెనీల లీజు అగ్రిమెంట్లు, ప్రకటనలకు, బడా వ్యాపార వ్యవహారాలు, క్రయ విక్రయాలు వంటివాటిపై స్టాంపు డ్యూటీ వేయండి. కానీ, సామాన్య ప్రజలపై మాత్రం అదనపు భారం మోపవద్దు.
- శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్