కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల నకిలీనోట్లను చెలామణి చేస్తూ ఓ ముఠా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ ముఠాలోని మరో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
సంక్రాంతి సందర్భంగా చద్మాల్తండాలో లక్ష్మమ్మ జాతర నిర్వహించగా నకిలి రూ.500 నోట్లను చెలామణి చేసిన ఏడుగురిని అరెస్టు చేసి, ఈ నెల 24న రిమాండ్కు పంపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు తిరుపతి అలియాస్ రాజును మంచిర్యాల జిల్లా అన్నారం గ్రామంలో బుధవారం అరెస్టు చేసినట్టు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారుతెలిపారు. మరో నిందితుడు జగన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.