జగిత్యాల అర్బన్, డిసెంబర్ 27 (విజయ క్రాంతి): జిల్లాలో సంచలనం సృష్టించిన బీర్పూర్ వ్యాపారి కాసం ఈశ్వరయ్య ఇంట్లో ఈనెల 14న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నింది తులను వారం రోజుల్లోనే పట్టుకున్నారు.
ఈ నెల 20న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 10 తులాల దొంగ సొ త్తును స్వాధీనం చేసుకోగా, మరో నింది తుడు ముకునూరి కిరణ్’కుమార్ పరారీలో ఉన్నాడు. కిరణ్ కుమార్ కోసం పోలీసు బృందాలు గాలిస్తుండడంతో కిరణ్ బంధు వుల ఒత్తిడితో శుక్రవారం జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ముందు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీసు లను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.