15-02-2025 01:16:48 AM
మహబూబ్ నగర్ రూరల్, ఫిబ్రవరి 13 : రాష్ర్టంలో ఉన్న మున్నూరు కాపు కులస్తులను రీ సర్వే చేయాలని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాష్ర్ట అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ కులగణలో మున్నూరు కాపు నీ జనాభా తగ్గించి, జనాభా గతంలో ఉన్న సంఖ్యను తగ్గించి వలన రిజర్వేషన్ పై నష్టపోతామని తెలియజేశారు. రాష్ర్ట ప్రభుత్వం స్పందించకపోతే పోరాట ఉదృతం చేస్తామని వెల్లడించారు.10 లక్షల మున్నూరు కాపు కులస్తులు కలిసి పేరూరు గ్రామంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు.
మున్నూరు కాపు కులస్తుల రామారావు మరో సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో ఫిర్యాదులు ఆలోచిస్తామని పేర్కొన్నారు. తక్కువ చేసి చూపించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెంటయ్య, జైపాల్, వెంకటయ్య, రాజు, మహేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.