30-03-2025 12:14:58 AM
సెమీ క్రయోజనిక్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్..
చెన్నై: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. శనివారం ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా లాక్స్ కెరోసెన్ 200టీ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించారు. ఇదే మన దేశంలో మొదటి మేజర్ హాట్ టెస్ట్ కావడం విశేషం. ఈ టెస్టు తమిళనాడులోని ఇస్రో ప్రపొల్షన్ సెంటర్‌లో జరిగింది. భవిష్యత్‌లో చేపట్టబోయే స్పేస్ మిషన్లలో శక్తివంతమైన ఈ ఇంజిన్‌ను ఉపయోగించేందుకు వీలుంటుంది. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్‌వోఎక్స్), కెరోసెన్‌లతో ఉంటుంది. ఈ విజయంతో భవిష్యత్‌లో ఇస్రో చేపట్టబోయే మిషన్లు మరింత శక్తివంతంగా మారనున్నాయి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.