08-04-2025 11:07:30 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ లోని సిఎంఆర్ కళాశాలలో ఒక విద్యార్థి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన ఘటన మరువకముందే అదే విద్యాసంస్థకు చెందిన మరో విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన సుమంత్ అనే విద్యార్థి సిఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాలకు వచ్చిన సుమంత్ కు ఛాతిలో నొప్పి రావడంతో తోటి విద్యార్థులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గుండెపోటుతో వరుసగా విద్యార్థులు మరణిస్తుండడంతో తోటి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.