calender_icon.png 28 December, 2024 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం

22-12-2024 01:36:09 AM

* ఈ ఏడాదిలో 17కి చేరిన మరణాలు

కోటా, డిసెంబర్ 21: రాజస్థాన్‌లో ని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తా జాగా ఐఐటీ ప్రిపేర్ అవుతున్న ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసు కున్నాడు. దీంతో ఈ ఏడాదిలో విద్యార్థుల మరణాల సంఖ్య 17కు చేరింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ 16 ఏండ్ల బాలుడు కోటాలో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్నాడు. విజ్ఞా న్ నగర్ పీఎస్ పరిధిలో హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు.

కాగా ఆత్మహత్యకు గల కార ణాలు తెలియరాలేదు. గదిలో ఎలాం టి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. వివిద పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో విద్యార్థులు ఒత్తిడి కారణంగా సూసైడ్‌లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 17 మంది బలవన్మరణాలకు పాల్పడగా, ఈ సంఖ్య గతేడాది 26గా ఉంది.