calender_icon.png 18 October, 2024 | 3:46 PM

భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు

18-10-2024 02:19:59 PM

న్యూఢిల్లీ: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. ఇక నుంచి సుప్రీకోర్టులో జరిగే వాదనలన్నీ ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ తో ప్రయోగాత్మక పరిశీలన చేయనున్నారు. లోటుపాట్లు సవరించి త్వరలో అందుబాటులోకి తేనుంది సుప్రీంకోర్టు వెల్లడించింది. త్వరలో సుప్రీం కోర్టులో అన్ని బెంచ్ లకు వర్తింపజేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు రాజ్యాంగ ధర్మాసన వాదనలు, తీర్పులే ప్రత్యక్ష ప్రసారం అయిన సంగతి తెలిసిందే.