calender_icon.png 27 November, 2024 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్సార్‌సీపీకి మరో షాక్!

25-09-2024 02:52:27 AM

రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా 

ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ 

2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక 

నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా 

సభలో 8కి పడిపోయిన వైఎస్సార్‌సీపీ బలం

2014లో టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పో యిన వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖను అందజేశారు.

కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ మంగళవారం ప్రకటించారు. 2022లో వైఎస్సార్‌సీపీ నుంచి రాజ్య సభ ఎంపీగా ఎన్నికైన ఆర్ కృష్ణయ్య.. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే తన పదవి కి రాజీనామా చేసినట్టు కృష్ణయ్య తెలిపారు.

ఇటీవల వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిం దే. ఏపీ నుంచి వైసీపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది ఎంపీలు ఉండగా,  ఇప్పుడు వారి సంఖ్య 8 మందికి పడిపోయింది. 

2019లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు విడతల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకున్నది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో  వైసీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి చాలా మంది బయటికి వెళ్లిపోతున్నారు. ఆర్ కృష్ణయ్య రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

2014 ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో టీడీ పీ ఆయనను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు. 2022లో వైఎస్సార్‌సీపీ ఆర్ కృష్ణయ్యను అనూహ్యంగా రాజ్యసభకు పం పింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరపున ఏపీలో ఆర్ కృష్ణ య్య ప్రచారం కూడా నిర్వహించారు. 

కొత్త పార్టీ పెడతారనే ప్రచారం 

విద్యార్థి రాజకీయాలతోపాటు బీసీల హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమా న్ని ౪ దశాబ్దాలుగా నడుపుతున్నారు. నిత్యం బీసీల హక్కుల కోసం పోరాటం చేసే కృష్ణ య్య 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. 2022లో  ఏపీ నుంచి వైసీసీ అధినేత జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాతా బీసీల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.

కొన్ని విషయాల్లో ఆయా రాజకీ య పార్టీల నుంచి అసంతృప్తి కూడా వ్యక్తమైనట్టు ప్రచారం ఉంది. దీంతో కొత్త రాజ కీయ పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని, ఇదే సమయంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ప్రచా రాలకు బలం చేకూర్చేలా నాలుగేళ్లు పదవీకాలం మిగిలి ఉండగానే ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. 

బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికే.. : ఆర్ కృష్ణయ్య

నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ బీసీ ఉద్యమం కోసం తాను ఎంపీ పదవి కి రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజీనామా ఆమోదం తర్వాత మంగళవారం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ ఉద్య మం బలోపేతం చేయాలని కొద్ది నెలలుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా మని తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించిందని, అధికా రంలోకి వచ్చి 9 నెలలు గడిచినా పెంచలేదని ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్నదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, చట్ట సభల్లోనూ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.

రాజకీయాలకు అతీతంగా ఉంటానని, బీసీ డిమాం డ్లకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీ మద్ద తు తీసుకుంటానని వెల్లడించారు. 100 బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.