ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
న్యూ ఢిల్లీ, ఆగస్టు 1: యూపీఎస్సీలో తప్పుడు వికలాంగ ధృవీకరణ పత్రం, అఫిడవిట్ సమర్పించిన కేసులో ఆరోపణులు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫున లాయర్ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ దేవేందర్ కుమార్ తిరస్కరించారు.
దీనికి తోడు ఆమె సమర్పించిన ఓబీసీ, వికలాంగ సర్టిఫికెట్, ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఉన్నారా? సివిల్స్ పరీక్ష సమయంలో ఇంకా ఎవరైనా నకిలీ పత్రాలు సమర్పించారా? అనే కోణంలో సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేద్కర్‌పై అధికార దుర్వినియోగం, తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ బోర్డు.. ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.