* ఎయిర్‌టెల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, వొడాఫోన్ ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. జులైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా వరుసగా సబ్‌స్ర్కైబర్లను కోల్పోతున్న ఆ కంపెనీలు.. అక్టోబర్‌లోనూ మరోసారి పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయాయి. ఎయిరెర్‌టెల్ మాత్రం కొత్త సబ్‌స్ర్కైబర్లను చేర్చుకోగలిగింది. అలాగే, ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి స్వల్పంగా సబ్‌స్ర్కైబర్ల్ల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలకు గానూ టెలి కాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.
అక్టోబర్ నెలలో ఎయిర్‌టెల్ 19.29 లక్షల మంది కొత్త సబ్‌స్ర్కైబర్లను చేర్చుకుంది. సెప్టెంబర్ నెలలో ఇదే కంపెనీ 14.35 లక్షల మంది యూజర్లను చేజార్చుకోవడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో దాదాపు 79.7 లక్షల మంది యూజర్లను జియో కోల్పోగా.. అక్టోబర్‌లో మరో 37.60 లక్షల మంది ఆ నెట్‌వర్క్‌ను వీడారు. అప్పుల ఊబిలో ఉన్న వొడాఫోన్ ఐడియా నుంచి మరో 19.77 లక్షల మంది యూజర్లు ఆ నెట్‌వర్క్‌కు గుడ్‌బై చెప్పారు. సెప్టెంబర్లో ఈ సంఖ్య 15.5 లక్షలుగా ఉంది.
టారిఫ్‌ల సవరణ అనంతరం ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి పెద్దఎత్తున యూజర్లను ఆకర్షించిన బీఎస్‌ఎన్‌ఎల్.. అక్టోబర్ నెలలో కొత్తగా మరో 5 లక్షల మం ది యూజర్లను పెంచుకుంది. సెప్టెంబర్లో పెరిగిన 8.5 లక్షల మంది యూజర్లతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయినప్పటికీ.. 39.9 శాతం మార్కెట్ వాటా పరంగా రిలయన్స్ జియోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఎయిర్‌టెల్ 33.50 శాతం, వొడాఫోన్ ఐడియా 18.30 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్ 8.50 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 4జీ సేవలు విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తే బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.