calender_icon.png 27 October, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తప్పదా?

24-07-2024 12:39:53 AM

మంగళవారం సమావేశానికి డుమ్మా కొట్టిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

ఆలస్యంగా వచ్చిన గోరటి, వెంకట్రామిరెడ్డి 

డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు జంప్ చేస్తారా అనే అనుమానాలు? 

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో అనుసరించా ల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ డుమ్మా కొట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలను సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

అత్యంత కీలకమైన సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీర్‌బాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి  హాజరుకాలేదు. గోరటి వెంకన్న, మెదక్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆలస్యంగా సమావేశానికి హాజరయ్యారు. మాణిక్‌రావు మా త్రం ఆనారోగ్య కారణాలతో రాలేదని తెలిసింది. బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలుండగా ఇప్పటికే 10 మంది శాసనస భ్యు లు అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తు తం 28 మంది సభ్యులు మాత్రమే గులాబీ బాస్ కేసీఆర్ వెంట అసెంబ్లీలో ఉండనున్నారు. 

జంప్ అవుతారా?

బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ వీడిన సభ్యులంతా కేసీఆర్ తమ నాయకుడుని ప్రగ్బలాలు పలికి తీరా సమయానికి  సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారని, అదే దారిలో ఈ ఐదుగురు ఉన్నారనే సందేహం తెలంగాణ భవన్‌లో ద్వితీయ స్థ్దాయి నాయకులు వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తుంటే ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎమ్మెల్సీ సమావేశానికి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినేతకు అండగా నిలవాల్సిన సభ్యులంతా అంటీముట్టనట్లుగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు ఎంతమంది పార్టీ వీడినా బీఆర్‌ఎస్‌కు నష్టంలేదని అంటున్నారు. 

తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ దూరం

తొలిరోజు అసెంబ్లీ సమావేశానికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన హాజరై సభలో ప్రసంగించడంతో పాటు బీఏసీ సమావేశంలో పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆయన గత సమావేశాల మాదిరిగానే ఇంటి వద్ద ఉన్నారు. ఈనెల 25న సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఆదే రోజు హాజరుకావచ్చని కొంత మంది నాయకులు చెబుతున్నారు. ఇంతవరకు ఆయన సభకు వచ్చే అంశంపై పార్టీ సీనియర్లు క్లారిటీ ఇవ్వడం లేదు. 

ఈనెల 25, 26 తేదీల్లో కాళేశ్వరం టూర్ 

బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఈనెల 25, 26 తేదీల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాళేశ్వరం పంపించాలని పార్టీ నిర్ణయించింది.