calender_icon.png 10 January, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రూ.700 పెరిగిన బంగారం

07-07-2024 12:54:32 AM

తులం ధర రూ. 73,800

హైదరాబాద్, జూలై 6: కొంతకాలంగా నిశ్చలంగా ఉన్న బంగారం ధర తిరిగి కొత్త రికార్డును అందుకునేదిశగా పయనిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా ధర పెరుగుతున్నదని బులియన్ వర్తకులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగా రం తులం ధర మరో  రూ.710 పెరిగి రూ. 73,800 వద్దకు చేరింది. గురువారం ఇది ఇదేతీరులో రూ.710 అధికమై 73,090 స్థాయికి పెరిగింది. శుక్రవారం స్థిరంగా ఉన్న ఈ ధర తిరిగి మరోసారి ఎగిసింది.

తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 67,650 వద్ద నిలిచింది. మే నెల 20న పూర్తి స్వచ్ఛతకలిగిన బం గారం ధర రూ. 75,160 రికార్డుస్థాయికి చేరి న తర్వాత ఇది క్రమేపీ తగ్గి రూ. 71,500 స్థా యికి దిగింది. గత వారం రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తున్నది. తాజాగా  యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనా లు ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్లో శుక్రవా రం రాత్రి ఔన్సు పుత్తడి ధర 30  డాలర్లకుపైగా పెరిగి 2,4,00 డాలర్ల స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ పడిపోవడంతో బంగారం ధర  నెల రోజుల  గరిష్ఠానికి చేరిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అనలిస్ట్ మానవ్ మోది చెప్పారు. 

వెండిదీ పుత్తడి బాటే..

వెండి ధర సైతం పుత్తడినే అనుసరించింది. తిరిగి రూ.లక్ష దాటేందుకు సిద్ధ మవుతున్నది. తాజాగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,600 మేర పెరిగి రూ. 99,300 వద్దకు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 3 శాతం వరకూ ఎగిసి 31 డాలర్ల స్థాయిని అందుకున్నది.