calender_icon.png 27 January, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ టాపింగ్ కేసులో మరో సంచలనం

26-01-2025 12:58:27 AM

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి 

ఫోన్ టాప్ అయినట్టు గుర్తించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి) : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ టాపింగ్ కేసులో మరో సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా టాప్ అయినట్టుగా తాజాగా పోలీసులు గుర్తించారు. 2023 అక్టోబర్ 26న ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియామకం అయ్యారు.

2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య కాలంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ టాప్ అయినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. రాష్ట్రంలో ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాక ర్‌రావు, మరో కీలక వ్యక్తి శ్రవణ్ కుమార్‌లు అమెరికాలో ఉండగా, ఈ కేసులో ఏ4గా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న ఎనిమిది నెలలుగా జైలులోనే ఉన్నాడు.

ఈ కేసులో కీలకమైన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవ ణ్‌రావులను విచారణ నిమిత్తం అమెరికా నుంచి రప్పించేందుకు రాష్ట్ర పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరుడుగట్టిన నేరస్థులను అప్పగించేందుకు భారత్‌తో అమెరికాకు ఒప్పందం ఉన్న నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను ఎక్స్‌ట్రడిషన్ (నేరస్థుల అప్పగింత) ప్రక్రియ ప్రారం భించనున్నట్టుగా తెలుస్తుంది.

ఈ క్రమంలో సీఐడీ ద్వారా కేంద్ర హోం శాఖకు నివేదిక పంపిస్తే అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. ఈ నివేదికను అమె రికా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ఆ ఇద్దరు నిందితులను భారత్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.