calender_icon.png 8 February, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

08-02-2025 12:21:04 AM

నార్త్‌వెస్టర్న్ వర్సిటీ నుంచి ఆహ్వానం

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ర్టంలోని ఇవాన్‌స్టన్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19న జరిగే కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్   ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాలని కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల లేఖలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రిగా కేటీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ప్రశంసించారు.

టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ వంటి వినూత్న ఆలోచనల వల్ల తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందిందని, ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.

ప్రపంచ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని, సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాలోని బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.