calender_icon.png 12 December, 2024 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ కలెక్టర్‌కు మరోసారి నిరసన సెగ

12-12-2024 01:53:48 PM

వికారాబాద్ : తాండూరు గిరిజన బాలికల వసతిగృహం వద్ద వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మరోసారి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. కలెక్టర్ వసతిగృహంలో బాలికలకు వైద్య చికిత్స పరిశీలనకు వెళ్లారు. మూడు రోజుల క్రితం వసతిగృహంలో 16 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స అందించాలని బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ ను కోరారు.