calender_icon.png 12 January, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనితర సాధ్యుడు!

26-08-2024 12:30:00 AM

భూమిలోపల వేళ్లు ఎంత బలంగా ఉంటాయో.. వాటి ద్వారా పెరిగే చెట్లు, కొమ్మలు, ఫలాలు కూడా అంతే స్థాయిలో ధృడంగా ఉంటాయి. అలాంటి బలమైన వృక్షమే డాక్టర్ ఎం.ఎస్ శివలింగం గౌడ్. గత మూడు తరాలుగా వీరి కుటుంబమంతా డెంటిస్టులుగా తమ సేవలను సమాజానికి అందిస్తున్నారు. చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు.. “చదువు జీవితాలను మార్చేస్తుంది.

చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుంది”. అన్న మాటలు డాక్టర్ ఎమ్మెస్ గౌడ్ మెదడులో బలంగా నాటుకుపోయాయి. తండ్రి మాటలకు కట్టుబడి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఐదు దశాబ్దాల జీవిత అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు.

మాది మెదక్‌లో ఓ మారుమూల గ్రామం. ఓ సన్నకా రు రైతు మంగా వెంకటయ్య. లక్ష్మీ నర్స మ్మ దంపతులకు జన్మించా. మా నాన్న రైతు అయినప్పటికీ కులవృత్తిలో కొనసాగేవాడు. ఆ వృత్తిలో వచ్చిన డబ్బులను సినిమా టాకీసులో పెట్టుబడి పెట్టడం విభిన్నంగా ఉండేవి. ఆయన ఆలోచనలు. మెదక్ లో మొదటి సినిమా టాకీసు అది. ఆ సమయంలోనే మా చదువుల పట్ల, మా భవిష్యత్తు పట్ల ఆయనకు బెంగగా ఉండేది. గ్రామంలో చదువుకుంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆనే ఆయన ఆలోచన నన్ను ఇక్కడిదాక తీసుకొచ్చింది. 

తండ్రి ఆలోచన మార్చివేసింది

ఇప్పుడంటే మారుమూల గ్రామంలోనుండి వచ్చి ఎక్కడెక్కడో చదువుకుంటు న్నారు. కానీ ఆరు, ఏడు దశాబ్దాల క్రితం ఇలా నగరాల్లో వచ్చి చదువుకోవాలనే ఆలోచన సాహసం అని చెప్పుకోవాలి. ఎం దుకుంటే అప్పటికీ మా నాన్నకు గ్రామం లో తప్ప పట్నంలో పెద్దగా పరిచయం లే దు. పైగా నేను అప్పటికీ స్కూల్ పిల్లవాడి ని గ్రామం దాటి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూసింది లేదు. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశ్యంతో మహానగరానికి తీసుకొచ్చాడు. మాకు అప్తుడు అయిన టి.ఎన్ గౌడ్ గారి ప్రొద్భలం కూడా ఉంది. ఆయన గైడన్స్ నాకో దారి చూపించింది

డెంటిస్ట్‌గా ప్రస్థానం

మనం ఎంత కష్టపడినా ఒక్కొసారి ఫలి తం వేరే విధంగా ఉంటుంది. నా జీవితం లో కూడా అలాంటిదే. ఎలాగైనా ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించాలని అని నా శక్తి మేరకు కష్టపడినా అందినట్టే అంది దూరమైంది. అటువంటి సమయంలో నిరాశ ని స్పృహలకు గురయ్యాను. ఓ ప్రొఫెసర్ సలహాతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో బీడీఎస్‌లో జాయిన్ అయ్యా. అక్కడ తెలంగాణ, ఆంధ్రా నుండే కాకుండా ఉత్తర భార త దేశంలోని పంజాబ్, ముంబాయి, ఢిల్లీ.. పలు ప్రాంతాల విద్యార్థులు చదువుకునేవారు. విభిన్న భాషలు నన్ను ముగ్ధుడ్ని చేశాయి. ఒక రకంగా విశాల ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించేంది.

అడ్డంకులను అధిగమించి..

సర్జన్ గా అయితే కోర్సు పూర్తి చేశాను. కానీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థంగా మారిపోయింది. మణిపాల్ డెంటల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరా. ఏదో అవసరానికి డబ్బులు వస్తున్నాయి. కానీ మా తల్లిదండ్రులు కన్న కల.. నా కల ఇది కాదు కదా అనే ఆలోచన తొలిచివేసింది.

కొన్నాళ్ల తర్వాత ధైర్యం చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశా. సుల్తాన్ బజార్ లో డెంటల్ ఆస్పత్రి ప్రారంభించా. ఈ పరీక్షలో నెగ్గితే ఇక నేను తిరిగి చూడకూడదు. అలా కా కుండా ఒడితే మాత్రం మళ్లీ ఈ వృత్తిలో కనిపించను అని గట్టి నిర్ణయం తీసుకన్నా. కానీ కష్టపడితే ఫలితం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అన్నట్లు ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నా.

డెంటిస్ట్ ఫ్యామిలీ

డాక్లర్ పిల్లలు డాక్టర్లే అవుతారు అంటారు. కానీ ఏ డాక్టర్ అవుతారనేది ఎవరూ చెప్పరు. కానీ మా ఇంట్లో మాత్రం విచిత్రంగా అందరూ డెంటిస్టులే. మా అబ్బాయి. కూతురు, కోడలు కూడా డెంటిస్టులే. ఒక కుటుంబం నుంచి ఒకే ఇంటి నుండి ఒకే విభాగం అంటే ఎవరికైనా కొత్తగానే అనిపిస్తుంది. కానీ మాకు మాత్రం ఇది సంతోషంగా ఉంది. ఇంట్లో జరిగే ప్రతి సంభాషణ ఒకరికొకరికి తోడ్పాటుగా ఉంటుంది. 

ఆధునికతకు ఆధ్యుడు

కాస్మొటిక్ డెంటిస్ట్, లేజర్ ట్రీట్ మెంట్ వంటి అత్యాధునిక చికిత్స విధానాలను తెలంగాణ, ఏపీల్లో ప్రవేశపెట్టింది నేను అని గర్వంగా చెప్పుకోవచ్చు. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దుర్వాసన అనేక సమస్యలకు రూట్ కెనాల్ చికిత్సలో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం చూపించే పద్ధతలు తొలి సారిగా ప్రవేశపెట్టాం. రంగుమారిన పళ్లు, దంతాల మధ్య సందులు బాగు చెయ్యడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగేవి. ఒక్కోసారి ఇవి విఫలం అయ్యేది. అలాంటి సమస్యలకు చెక్‌పెడుతూ కంప్యూటర్ ఎడిటెడ్ డిజైనింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యు ఫ్యాక్చరింగ్ ప్రక్రియలను అయబాటులోకి తీసుకొచ్చిన ఘనత కూడా మా హాస్పిటల్‌దే.

వృత్తి పరిధి దాటి

ఏదైనా వృత్తిలో బాగా రాణించాలంటే వృత్తిని వృత్తిలా స్వీకరించే సరిపోదు. సేవతో పాటు మానవత్వం కూడా ఉండాలి. ఈ వృత్తిలో నేను ఇంతకాలం రాణించానంటే దానికి కారణం అదేనేమో. ఐదు దశాబ్దాలు ఒక వృత్తిలో కొనసాగడం.. నాలుగు తరాలకు సేవ చేసే అవకాశం ఎవరికీ రాదు. కానీ నాకొచ్చింది. ఎంత ఎదిగినా కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరిచిపోరాదు అన్నట్లు నేను పుట్టిపెరిగిన గ్రామంలో విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి గౌడ్స్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నా. వికరాబాద్ జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని బాకారం జాగిర్ గ్రామాన్ని దత్తత తీసుకొని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ గ్రామానికి సాక్షర భారత్ అవార్డు కూడా లభించింది.