- ఆరుగురు ప్రయాణికుల మృతి
- విచారం వ్యక్తం చేసిన అధ్యక్షుడు ట్రంప్
ఫిలడేల్ఫియా, ఫిబ్రవరి 1: రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో 67 మంది మృతిచెందిన ఘటన మరవకముందే అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. నార్త్‌ఈ స్ట్ ఫిలడేల్ఫియాలోని రూసోవెల్ట్ షాపింగ్‌మాల్ సమీపంలో శుక్రవారం విమానం కూలింది.
ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్‌పోర్టర్‌గా అధికారులు గుర్తించారు.
ప్రమాద సమయంలో విమానంలో నలుగు రు సిబ్బందితో పాటు.. ఓ చిన్నారి, ఆమె త ల్లి ఉన్నారు. ప్రమాదంలో వీరంతా ప్రాణా లు కోల్పోయారు. మెక్సికోకు చెందిన చిన్నా రి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఫిలడెల్ఫియాలో చికిత్స అందించా రు. తిరిగి మెక్సికోకు తీసుకెళ్తుండగా ఈ ఘ టన జరిగింది. తక్కువ ఎత్తు ఎగిరే వాణిజ్య విమానాలు, మిలిటరీ హెలికాప్టర్‌లతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
అమాయకులు ప్రాణాలు కోల్పోయారు: ట్రంప్
ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అధికారులు రె స్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు’ అని ట్రూ త్‌లో పేర్కొన్నారు.