జెరూసలెం/బీరూట్, నవంబర్ 1: ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరాన్ ప్రతీకారం కోసం చూస్తుం డటంతో ఎప్పుడు ఏం జరుగుతోందనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌ను కేంద్రంగా చేసుకుని టెల్‌అవీవ్‌పై ఇరాన్ దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘావర్గాలు తెలిపాయి. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో అందరి దృష్టి అటువైపు ఉంటు ందని, వీలైతే ఎన్నికలకు ముందే దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాక్‌లోని మిలిటెంట్లతో దాడులు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు యాక్సియోస్ రిపోర్టు తెలిపింది.
నెతన్యాహును చంపేస్తాం: హెజ్‌బొల్లా
తమ అగ్రనేతల చావుకు కారణమైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును చంపేస్తామని హెజ్‌బొల్లా కొత్త చీఫ్ నయీమ్ ఖాసిం హెచ్చరించారు. దీంతో నెతన్యాహుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఖాసిం మొదటి సారి ప్రసంగిస్తూ ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. ఇటీవల నెతన్యాహు ఇంటిపైకి డ్రోన్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.