calender_icon.png 28 November, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్

28-11-2024 10:24:20 AM

అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో ఆర్జీవీ కోర్టును కోరారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలన్నారు. కాగా నేడు వర్మ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. అటు డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఆర్జీవీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడకు పారిపోలేదంటూ వర్మ రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్జీవీ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఆర్జీవీ బెయిల్‌ పిటిషన్ నిన్న హైకోర్టులో విచారణకు రాలేదు.