calender_icon.png 4 March, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరొకరి మృతి

03-03-2025 01:33:50 AM

ఎల్లారెడ్డి, మార్చి 2 (విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట ప్రధాన రహదారిలో గల పెద్దారెడ్డి పెట్రోల్ పంపు మూలమలుపు వద్ద శనివారం నాడు రాత్రి కారు లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెంది మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే.

రాఘవ పల్లి తండాకు చెందిన ఫుల్ సింగ్ బంధువులతో కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పూల్ సింగ్ అక్కడికక్కడే చెందగా గాయపడిన వారిలో పూల్ సింగ్ బంధువు నారాయణఖేడ్ మండలం మాదారం గ్రామానికి చెందిన స్వరూప (40) ఆదివారం నాడు చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.