calender_icon.png 8 February, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో మరో 487 మంది..

08-02-2025 12:18:23 AM

  • అక్రమవలసదారుల విషయంలో యూఎస్ దూకుడు
  • ఇప్పటికే భారత్‌కు చేరుకున్న 104 మంది
  • 2009 నుంచి 15వేల పైచిలుకు భారతీయులు వెనక్కి
  • ధ్రువీకరించిన భారతప్రభుత్వం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అక్రమ వలసదారుల విషయంలో అమెరికా దూకుడు చూపి స్తోంది. వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వెనక్కు పంపుతున్న ట్రంప్ సర్కారు..

మొదటి విడతగా 104 మంది భారతీయులను కూడా వెనక్కి పంపింది. ఫిబ్రవరి 5న అమృత్‌సర్‌కు చేరుకున్న 104 మందిని వారి సొంత ఇంటికి చేరిపోయారు. వీరిని అమెరికా నుంచి భారత్‌కు తరలించే సమయంలో యూఎస్ అధికారులు వ్యవహరించిన తీరు మీద పార్లమెంట్ భగ్గుమంది.

త్వరలో మరో 487 మంది.. 

అమెరికా నుంచి త్వరలో మరో 487 మంది అక్రమవలసదారులు భారత్‌కు రా నున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘ఈ సారి జాబితాలో 487 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లు అమెరికా తెలిపింది.

ఇంకా ఎవరెవర్ని పంపిస్తారనే విష యం గురించి అమెరికా అధికారులు తెలపలేదు. మొదటి విడతలో వచ్చిన భారతీ యుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసిన ఘట న గురించి అమెరికా అధికారుల వద్ద వాదనలు వినిపించాం’. అని ఆయన తెలిపారు.

15,688 మంది వెనక్కి.. 

2009 నుంచి అమెరికా వెనక్కి పం పిన భారతీయుల సంఖ్య 15,668గా ఉందని రాజ్యసభలో విదేశాంగ మం త్రి జైశంకర్ స్పష్టం చేశారు. అంతే కాకుండా డిపోర్టేషన్ ప్రక్రియ అనేది ఏం కొత్తది కాదు అని మంత్రి పేర్కొన్నారు.

అత్యధికంగా 2009లో 734 మందిని అగ్రరాజ్యం వెనక్కు పంపగా.. 2019లో కూడా ఈ సంఖ్య 2042గా ఉంది. 2025లో చూసుకుంటే (ఇప్పటి వరకు) 104 మంది తిరిగి వచ్చారు.