calender_icon.png 11 January, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజృంభిస్తున్న మరో మహమ్మారి

03-12-2024 03:01:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బ్లీడింగ్ ఐ వైరస్ బారినపడి రువాండాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వైర స్ సోకి వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 17దేశాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్న ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవాళ్లు అప్ర మత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైరస్ ఆనవాళ్లు కనిపించిన దేశాలను డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం చేసి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్‌బర్గ్ వైరస్ అని కూడా పిలిచే ఈ వైరస్ గబ్బిలాల్లో ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మూత్రం, లాలాజలం, రక్తం ద్వారా వ్యాపిస్తుంది.

వైరస్ సోకిన వ్యక్తులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ముక్కు, కళ్లు, మలమూత్రాల ద్వారా రక్తాన్ని కోల్పోతారు. దీన్ని తగ్గించడానికి సరైన చికిత్స అందుబాటులో లేదు.