- ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనాలు
- స్మశాన వాటికల వద్ద భారీ క్యూలు
- హెచ్‌ఎంపీవీ వైరస్‌గా నామకరణం
- కరోనా తర్వాత మరోసారి బెంబేలు
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన?
- ఆందోళన వద్దన్న భారత హెల్త్ ఏజెన్సీ
- ఇన్ఫెక్షన్లు సహజమన్న చైనా
- మా దేశంలో నిరభ్యంతరంగా పర్యటించవచ్చని స్పష్టీకరణ
- గడగడలాడుతున్న ప్రపంచ దేశాలు
కొత్త వైరస్ గుప్పిట చైనా గడగడ
కరోనా లాగే హెచ్‌ఎంపీవీ వైరస్
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ).. కరోనా తరువాత ఐదేళ్లకు చైనాను వణికిస్తున్న మరో మహ మ్మారి వైరస్ ఇది. హెచ్‌ఎంపీవీ శరవేగం గా వ్యాప్తిస్తోందన్న వార్త ఇప్పుడు చైనాతో పాటు అనేక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇది చిన్న పిల్లలకు, వృద్ధులకు ఎక్కువగా సోకుతున్నట్లు తెలుస్తోంది. దీనితో చైనాలో ఆసుపత్రులు, స్మశానవాటికలు జనాలతో నిండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిస్థితి లో చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ దేశంలో ఇన్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్ వైరస్‌లూ ప్రజలను ఆసుపత్రులపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలోని ఈ కొత్త వైరస్ గురించి ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నా చైనా మాత్రం నిమ్మకు నీరెత్తి నట్టు ఉంది. శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్లు సహజమేనని చెబుతోంది.
అంతేకాదు తమ దేశంలో నిరభ్యంతరంగా పర్యటించొచ్చని పేర్కొంది. ఈ పరిస్థితిపై స్పం దించిన భారత్ కూడా ఆందోళన చెందనవసరం లేదని ప్రకటించింది. హెచ్‌ఎం పీవీ సోకితే జ్వరం, ఇతర శ్వాసకోస ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు ఉండే లక్షణాలే కనిపి స్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువైతే బ్రాంకైటిస్, న్యుమోనియాకు దారి తీసే అవకా శాలున్నాయి. వైరస్ శరీరంలో చేరిన 3 నుంచి 6 రోజుల్లో దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కరోనా సమయంలో మన ల్ని మనం ఎలా పరిశుభ్రంగా ఉంచుకున్నామో ఈ వైరస్ దరి చేరకుండా ఉండేందుకు పరిశుభ్రతే ప్రధానం.
న్యూఢిల్లీ, జనవరి 3: డ్రాగన్ కంట్రీ చైనాలో మరో భయంకర వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోందన్న వార్త ఇప్పుడు చైనాతో పాటు అనేక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వైరస్‌కు హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)గా నామకరణం చేశారు. ఈ వైరస్ వల్ల ప్రస్తుతం చైనాలో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ వార్త విని అనేక ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
చైనా ఉత్తర ప్రాంతంలో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు మొత్తం అసలు ఏంటి ఈ వైరస్, దీని లక్షణాలు ఏమిటి? ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాయి.
ఈ వైరస్ ఎక్కువగా చిన్న పిల్లలకు సోకుతున్నట్లు తెలుస్తోంది. చైనా వైద్యాధికారులు ఈ హెచ్‌ఎంపీవీ వైరస్ సంక్రమణను అంటువ్యాధిగా పేర్కోలేదు. కరోనా మానవాళిని భయబ్రాంతులకు గురి చేసిన ఐదు సంవత్సరాల తర్వాత ఈ వైరస్ బయటికొచ్చింది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అనేక సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి.
ప్రతి ఒక్కరూ ఇంతలా భయపడు తున్నా కానీ చైనా మాత్రం అసలు ఏం జరగనట్లే వ్యవహరిస్తోంది. శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్లు సహజమేనంది. అంతే కాకుండా తమ దేశంలో నిరభ్యంతరంగా పర్యటించొచ్చని పేర్కొంది. ఈ పరిస్థితిపై స్పందించిన భారత్ కూడా ఆందోళన అక్కర్లేదంది.
ఆసుపత్రులు, స్మశాన వాటికలు ఫుల్!
కరోనా సమయంలో ఎక్కడ చూసినా ఆర్థనాదాలే వినిపించాయి. ఆసుపత్రులు, స్మశాన వాటికలు కిక్కిరిసి కనిపించేవి. ప్రస్తుతం కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఆసుపత్రులు, స్మశానవాటికలు జనాలతో నిండిపోయినట్లు పోస్టులు పెడుతున్నారు.
కేవలం ఈ హెచ్‌ఎంపీవీ వైరస్ ఒక్కటి మాత్రమే కాకుండా ఇన్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్ వైరస్‌లు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. చైనా ఈ పరిస్థితిలో ఎమర్జెన్సీని ప్రకటించిందని కూడా కొంత మంది చెబుతున్నారు.
కానీ దీని మీద ఎటువంటి స్పష్టత లేదు. ఈ వైరస్ సోకితే కరోనా సోకినపుడు ఎటువంటి లక్షణాలు అయితే ఉండేవో అలాగే ఉంటాయని వైద్యులు తెలిపారు.
చైనాను చుట్టేసిన వైరస్‌లు!
సోషల్ మీడియాలో ఓ యూజర్ పోస్ట్ పెడుతూ ప్రస్తుతం చైనాను వైరస్‌లు కుదిపేస్తున్నాయని పేర్కొన్నారు. ‘చైనాలో కేవలం ఈ వైరస్ మాత్రమే కాదు.. ఓ పక్క ఇన్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, కరోనా చుట్టుము ట్టాయి. ఆసుపత్రులు, స్మశాన వాటికలు జనాలతో కిక్కిరిసి పోయాయి.
పిల్లల దవాఖానాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. న్యుమోనియా, వైట్ లంగ్ కేసులతో అవి నిండిపోయాయి’ అని తెలిపారు.
మరో మహమ్మారి కాబోతుందా?
కరోనా మహమ్మారి మానవాళిని ఎలా భయపెట్టిందో అందరం చూశాం. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్ కూడా మరో మహమ్మారిలా విరుచుకుపడుతుందా? అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారని కొంత మంది చెబుతుండగా.. అటువంటి దానిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. హెచ్‌ఎంపీవీకి ప్రస్తుతానికి ఎటువంటి చికిత్స కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేదు. జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే శ్రీ రామ రక్ష.
ఆందోళన అక్కర్లేదు: భారత్
చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్‌ఎస్ స్పందించింది. ఎవరూ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్‌ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ సూచించారు.
జాగ్రత్తలు తీసుకుం టే సరిపోతుందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. శ్వాసకోస సంబంధిత వైరస్‌ల వ్యాప్తికి సంబంధించిన డేటాలో గణనీయమైన మార్పులేవీ కనిపించలేదన్నారు.
లక్షణాలివే..
కొత్త వైరస్ హెచ్‌ఎంపీవీ సోకితే ఎటువంటి లక్షణాలు ఉంటాయని అంతా ఆందోళన చెందుతున్నారు. దీని లక్షణా లు కూడా కరోనా లాగే ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
* హెచ్‌ఎంపీవీ సోకితే జ్వరం, ఇతర శ్వాసకోస ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు ఏవైతే లక్షణాలు ఉంటాయో అవే ఉంటాయి.
* శ్వాసతీసుకోవడం కష్టం అవుతుంది. ముక్కుదిబ్బడ, దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడతారు
* వైరస్ తీవ్రత ఎక్కువైతే బ్రాంకైటిస్, న్యుమోనియాకు దారి తీసే అవకాశాలున్నాయి.
* వైరస్ మన శరీరంలో చేరి న 3 నుంచి 6 రోజుల్లో దా ని ప్రభావాన్ని చూపిస్తుంది.
* మనలో కనిపించే లక్షణాలు అనేవి వైరస్ తీవ్రత మీద మనకు సోకిన ఇన్ఫెక్షన్ మీద ఆధారపడి ఉంటాయి.
* అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన దాని ప్రకారం.. చిన్నారులు, ముసలివారు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
* దగ్గు, తుమ్ములు వల్ల వచ్చే తుంపర్ల వల్ల
* వైరస్ సోకిన వ్యక్తులతో కరచాలనాలు, వారిని ముట్టుకోవడం వల్ల..
* వైరస్‌తో ఉన్న ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకడం ఈ వైరస్ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వారికి ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ వయసు ల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
నివారణ ఎలా?
ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
* కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎలాగైతే పరిసరాలతో పాటు, మనల్ని మనం కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నామో ఈ వైరస్ ధరి చేరకుండా ఉండేందుకు కూడా పరిశుభ్రత అనేది ప్రధానం.
* ఎవరికైనా వైరస్ సోకినా, వైరస్ సోకకున్నా కానీ దగ్గేటపుడు, తుమ్మేట పుడు ముక్కుకు చేతులు కానీ ఓ గుడ్డు కానీ అడ్డుగా ఉంచుకోవాలి.
* ఒక వేళ చేతులు అడ్డంగా పెట్టుకుంటే తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.
* వైరస్ సోకిందని అనుమానం ఉన్న వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు.
* వైరస్ సోకిన వ్యక్తులకు తప్పకుండా దూరంగా ఉండాలి.
చికిత్స ఉందా..
హెచ్‌ఎంపీవీ వైరస్ సోకిన వారు క్యూర్ అయ్యేందుకు ఏదైనా చికిత్స లేదా ఈ వైరస్‌కు వ్యాక్సిన్ ఉందా అని చాలా మంది ఆరాతీస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే ఈ వైరస్‌కు ఎటువంటి చికిత్స కానీ వ్యాక్సిన్ కానీ లేదు. ముందు జాగ్రత్తగా ఉండడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటివి మాత్రమే ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి.
మా దేశంలో పర్యటించేందుకు భయం అక్కర్లేదు: చైనా
హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై చైనా స్పందించింది. డ్రాగన్ కంట్రీ మరోమారు జిమ్మిక్కులు ప్రదర్శించింది. హెచ్‌ఎంపీవీ వైరస్ కారణంగా ఆసుపత్రులలో రోగుల తీవ్రత పెరిగిందని పలు వీడియోలు స్పష్టం చేస్తున్నా కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం గతేడాదితో పోలిస్తే శ్వాసకోస వ్యాధుల సంఖ్య తక్కువగానే ఉందని వెల్లడించింది.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘శీతాకాలంలో ఇన్ఫెక్షన్లు సహజం. గతేడాదితో పోలిస్తే ఈ ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగానే ఉంది.
చైనా దేశీయుల ఆరోగ్యంతో పాటు ఇక్కడున్న విదేశీయుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం పూర్తి శ్రద్ధ కనబరుస్తోంది. చైనాలో పర్యటించడం సురక్షితమే’ అని అన్నారు.