calender_icon.png 25 January, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైలో మరో నిర్భయ?

25-01-2025 12:49:52 AM

  1. రేప్‌తో పాటు ప్రైవేట్ పార్ట్స్‌లో బ్లేడ్ చొప్పించాడని ఆటోడ్రైవర్‌పై యువతి ఫిర్యాదు
  2. ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  3. ఇంట్లో వాళ్ల భయంతోనే యువతి అలా చేసిందా!
  4. యువతి మానసిక స్థితి సరిగా లేదా ? 

ముంబై, జనవరి 24: ఓ 20 ఏండ్ల యువతి నడిపిన తతంగం పోలీసులను షాక్ అయ్యేలా చేసింది. రాత్రంతా ఎక్కడికెళ్లావని తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయంతో ఆ యువతి వేసిన స్కెచ్ అందర్నీ నిర్ఘాంతపోయేలా చేసింది. తనను ఓ ఆటో డ్రైవర్ రేప్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు చొప్పించారని పోలీసులతో చెప్పింది.

అంతే కాకుండా తాను అనాథను అని కూ డా చెప్పింది. దీంతో పోలీసులు ఆ ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అసలు కేసు గురించి ఎంక్వైరీ చేయగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జరిగిందిదే.. 

మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలో ఉన్న నలసోపారా ప్రాంతంలో ఓ 20 ఏండ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇక పోలీసులు చెప్పిన వివరాలు పరిశీలిస్తే.. ఆ యువతి తన ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్నాల బీచ్‌కు ఓ ఆటో డ్రైవర్‌తో కలిసి వెళ్లింది. రాత్రంతా అక్కడే గడిపేందుకు వారిద్దరూ ప్లాన్ చేసుకున్నారు.

కానీ వారి వద్ద సరైన ఐడీ ప్రూఫ్‌లు లేకపోవడంతో అక్కడున్న హోటల్ సిబ్బంది వారికి గదిని అద్దెక్కిచ్చేందుకు నిరాకరించారు. దీంతో వారు రాత్రంతా ఆ బీచ్‌లోనే గడిపారు. అక్కడే ఆ ఆటో డ్రైవర్ యువతిపై అత్యాచారం చేశాడు. ఉదయాన్నే ఆ యువతిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాడు. 

ఇంట్లో వాళ్ల మీద భయంతో..

రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని ఇంట్లో వాళ్లు తిడతారని భయపడిన ఆ యువతి భారీ స్కెచ్చేసింది. వెంటనే ఓ సర్జికల్ బ్లేడ్ కొనుగోలు చేసి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్‌కు  వెళ్లింది. ఆ సర్జికల్ బ్లేడ్‌ను ఓ కవర్లో చుట్టి.. అలాగే రాళ్లను కూడా తన ప్రైవేట్ పార్ట్స్‌లో కి చొప్పించుకుంది.

రక్తస్రావం కాగానే పోలీసులకు కాల్ చేసింది. పోలీసులు వచ్చాక తనను ఆటోడ్రైవర్ రేప్ చేశాడని, తన ప్రైవే ట్ పార్ట్స్‌లో రాళ్లు, సర్జికల్ బ్లేడ్ చొప్పించాడని ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడిని రాజ్ రతన్‌గా గుర్తించారు. 

పొంతన లేని సమాధానాలు.. 

ఆ యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానాలు ఎక్కువయ్యాయి. తొలుత తాను అనాథను అని వారణాసిలో తన అంకుల్ వద్ద ఉంటానని చెప్పిన ఆ యువతి ఆదివారం రోజే ముంబైకి వచ్చానని తెలిపింది.

కానీ ఆ యువతికి తండ్రి ఉన్నాడని 2023లో కూడా తన కూతురు రెండుసార్లు రేప్ కేసులు పెట్టిందని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఆ యువతికి మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ యువతి పొంతన లేని సమాధానాలపై విచారణ చేస్తున్నారు.