calender_icon.png 23 February, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాలో మరో కొత్త రకం వైరస్

23-02-2025 12:43:45 AM

హెచ్‌కేయూ 5 గుర్తింపు

గబ్బిలాల ద్వారా జంతువుల నుంచి మనుషులకు

సార్స్‌తో పోలిస్తే ప్రభావం తక్కువే

‘బ్యాట్ వుమన్’ షి జెంగ్లీ పరిశోధన ద్వారా వెలుగులోకి

బీజింగ్: చైనాలో మరో కొత్త రకం కరోనా వైరస్ బయటపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌కు హెచ్‌కేయూ5 కోవ్ నామకరణం చేశారు. గబ్బిలాల్లో వైరస్‌లపై అధ్యయనాలతో ‘బ్యాట్‌వుమన్’గా ప్రాచుర్యం పొందిన షి జెంగ్లీ అనే వైరాలజిస్ట్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ వైరస్‌ను కనుగొన్నారు.  కోవిడ్ వ్యాప్తికి కారణమైన ‘సార్స్ వైరస్‌ను పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. హెచ్‌కేయూ5 వైరస్ మెర్బెకోవైరస్ ఉప రకానికి చెందనదని.. ఇందులో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (బెర్స్) వైరస్ కూడా ఉందని పరిశోధకులు తెలిపారు. హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటిసారి గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనా వైరస్ శ్రేణికి చెందినదని చెప్పారు. సార్స్ పోలిస్తే హెచ్‌కేయూ5 వైరస్‌తో మానవాళికి పెద్దగా ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇటీవల చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. అయితే ఇక్కడ నమోదైన కేసుల్లో చాలా వరకు హెచ్‌కేయూ5 లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. ఈ కొత్త వైరస్ మొదట గబ్బిలాల నుంచి జంతువులకు.. అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేశారు. హెచ్‌కేయూ5 కోవ్ వైరస్ గుర్తింపు పరిశోధనలో గాంఘ్జౌ లేబొరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయం, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరలాజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. పరిశోదనకు సంబంధించిన వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.