calender_icon.png 31 October, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాకు మరో కొత్త రైల్వే లైన్

30-10-2024 01:27:20 AM

  1. భూసేకరణకు వచ్చిన అధికారులు
  2. రైల్వే బైపాస్ సర్వేను అడ్డుకున్న స్థానికులు

కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాకు మరో కొత్త రైల్వే లైన్ మంజూరైంది. సికింద్రాబాద్ నుంచి నిజాంసాగర్, బాన్సువాడ మీదుగా నాందేడ్‌కు రైలు మార్గాన్ని వేసేందుకు రైల్వే అధికారులు పచ్చ జెండా ఊపారు. నిజాంసాగర్ మండల పరిసర ప్రాంతాల్లో మంగళవారం భూసేకరణ గురించి అధికారులు మార్కింగ్ పనులు చేపట్టారు.

కామారెడ్డి జిల్లాకు మరొ కొత్త రైల్వేలైన్ వస్తుండటం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కల నేరవేరనుందని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజాంసాగర్, పిట్లం మండ లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 161వ జాతీయ రహదారి ఉండటంతో రైల్వే లైన్ వస్తే మరింత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

అసలే  వెనుకబడిన ప్రాంతాలైన జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వ్యాపారపరం గా, విద్యపరంగా ఎంతో వెనుకబడి ఉన్నా రు. జుక్కల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్‌ను తీసుకొస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

బిచ్కుందలోని ఐటీఐలో నూతన కొర్సులు ప్రవేశపెట్టేందుకు కృషి చేశారు.  రైల్వే మార్గంతో మరింత అభివృద్ధి చెందడమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.  

సర్వే అడ్డగింత

రైల్వే బైపాస్ పనుల సర్వేకు వచ్చిన అధికారులను అశోక్ ఏన్‌క్లేవ్ వెంచర్‌లో పాట్లు కొనుగోలు చేసినవారు అడ్డుకున్నారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్ల నుంచి రైల్వే బైపాస్ పనులు చేపట్టవద్దని కోరారు.దీంతో అధికారులు సర్వే నిర్వహించకుండా వెళ్లిపోయారు. అధికారులు సూచించిన ప్రకారం రైల్వే బైపాస్ చేపడితే 72 మంది ప్లాట్ల యాజమానులకు నష్టం చేకూరనున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.