24-04-2025 12:00:00 AM
నాగమహేశ్, రూపలక్ష్మి, ‘బాహుబలి’ ప్రభాకర్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కర్మణి’. రమేశ్ అనెగౌని దర్శకత్వం వహించనున్నారు. రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మంజుల చవన్, రమేశ్‌గౌడ్ అనెగౌని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో నిర్వహించారు.
2022లో డైరెక్టర్ రమేశ్ అనెగౌని తెరకెక్కించిన ‘మన్నించవా..’ చిత్రానికి అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్‌తో కలిసి చేస్తున్న తాజా ప్రాజెక్టు ఇది. ఈ సినిమా ప్రారంభోత్సం సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రమేశ్ అనెగౌని మాట్లాడుతూ.. “ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభోత్సవం జరిగే సినిమాలు హిట్ కొడతాయి.
ఈ సెంటిమెంట్ మా ‘కర్మణి’ సినిమాకు కలిసివస్తుందన్న నమ్మకం ఉంది. మే తొలి వారంలో మొదటి షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని తెలిపారు. నిర్మాత మంజుల చవన్ మాట్లాడుతూ.. ‘మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇండస్ట్రీకి మంచి సినిమా అందిద్దామన్న ఉద్దేశంతో ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి జగదీశ్ కొమరి డీవోపీగా పనిచేస్తుండగా, జాన్ భూషణ్ సంగీతం సమకూర్చనున్నారు. ఎడిటర్‌గా వీ నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారు.