calender_icon.png 21 April, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మసీదు వివాదం

26-11-2024 12:00:00 AM

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి మూడు దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మరో మసీదు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. కోర్టుదేశాల మేరకు మొరాదాబాద్ జిల్లా లోని సంభాల్ పట్టణంలో మొగలుల కాలం నాటి జామామసీదు సర్వే ఆదివారం పెద్ద ఎత్తున హింసాకాండకు దారి తీసింది. సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై దాదాపు వెయ్యిమంది రాళ్ల వర్షం కురిపించడంతో పాటుగా పెద్ద ఎత్తున వాహనాల దగ్ధానికి యత్నించారు.

దీంతో పోలీసులు లాఠీచార్జి, భాష్పవాయు ప్రయోగం జరిపారు. అదే సమయం లో కొందరు ఇళ్లలోంచి పోలీసులపై కాల్పులు జరిపారన్న కథనాలున్నాయి. ఈ ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా 30 మందిపైగా పోలీసు లు గాయపడ్డారు పట్టణంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇంతకీ ఈ మసీదుపై వివాదం ఏమిటి? సంభాల్‌లోని జామా మసీదును మొగలుచక్రవర్తి బాబరు హయాంలో16వ శతాబ్దంలో  నిర్మించారు.

బాబరు హయాంలో నిర్మించిన మూడు మసీదుల్లో ఇది ఒకటి. మిగతా రెండింటిలో ఒకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీమసీదు కాగా, పానిపట్టులోని మసీదు మరోటి. అయితే అప్పటికే అక్కడున్న హిందూ ఆలయాన్ని కూలగొట్టి ఈ మసీదును నిర్మించారనేది చరిత్రకారులు వాదన. సంభాల్ మహా విష్ణువు దశావతారాల్లో చివరిదయిన కల్కి జన్మస్థానంగా హిందువులు భావిస్తారు. ఇక్కడున్న కల్కి మందిరాన్ని కూల్చివేసి దాని శిధిలాలపై జామా మసీదు ను నిర్మించారంటూ విష్ణుప్రసాద్ జైన్ అనే అడ్వకేట్, మరికొందరు సంభాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం మొదలైంది.

బాబర్‌నామా, ఐన్‌ఎ అక్బర్ వంటి చారిత్రక గంథాలలో కూడా బాబర్ ఈ ఆలయాన్ని కూల్చేసిన ప్రస్తావన ఉందని కూడా పిటిషనర్లు వాదిస్తున్నారు. చారిత్రక ప్రదేశాల పరిరక్షణ చట్టం కింద ఈ ప్రదేశాన్ని భారత పురాతత్వ శాఖ స్వాధీనం చేసుకోకపోవడాన్ని కూడా వారు తప్పుబట్టారు. హిందువులు పూజలు చేయడానికి వీలుగా ఎలాంటి ఆంక్షలు లే కుండా మసీదులోకి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్థానిక కోర్టు ఈ నెల 19న మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశించింది.

అదే రోజు అడ్వకేట్ కమిషనర్, జిల్లా అధికారులు, పోలీసు లు సర్వే చేపట్టారు కూడా. అయితే కోర్టు అవసరానికి మించి వేగంగా స్పందించిందని, నిబంధనలు పాటించడంలో లోపాలు జరిగాయని ము స్లింలతో పాటు పలు వర్గాలు విమర్శిస్తున్నాయి. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల్లో ఎలాంటి మార్పులు చేయరాదని చట్టం ఉన్నప్పటికీ సర్వేకు ఆదేశించడం మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా స్థానిక సమాజ్‌వాది పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఆరోపించారు.

గత మంగళవారం సర్వే మొదలైనప్పటినుంచి ఉద్రిక్తత కొనసాగుతూ నే ఉంది. అయితే ఆదివారం నాడు రెండోసారి సర్వే నిర్వహించడానికి అ ధికారులు రాగా మసీదు సమీపంలో భారీ సంఖ్యలో గుమికూడిన జనం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు సైతం లాఠీచార్జి, భాష్పవా యు ప్రయోగం జరిపారు.ఈ ఘర్షణల్లో నలుగురు చనిపోగా, 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అల్లరి మూకలను రెచ్చగొట్టారన్న ఆరోపణపై స్థానిక ఎంపీ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు.

ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొంది. ఉప ఎన్నికల్లో అక్రమాలనుంచి దృష్టి మళ్లించడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే ఈ అల్లర్లను రెచ్చగొట్టిందని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పోలీసుల తీరుపై మండి పడ్డారు. బాబ్రీమసీదు తరహాలో ఈ మసీదును కూడా కూల్చివేయడాని కి కుట్ర జరుగుతోందన్న భయాలే ఈ అల్లర్లకు కారణంగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.