calender_icon.png 8 January, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాపర్తికి మరో కలికితురాయి

08-01-2025 12:39:11 AM

* విద్యార్థులకు వరంగా  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్

* భవన నిర్మాణానికి 100 కోట్ల మంజూరు జీవో 

వనపర్తి, జనవరి ౭ ( విజయక్రాంతి ) : వనపర్తి అంటేనే విద్యాపర్తిగా రాష్ర్టవ్యా ప్తంగా పేరుంది. వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు విద్యాసం స్థలు వనపర్తి లో ఏర్పాటు కావడం జరిగిన విషయం తెలిసిందే.  ఇటీవల రాష్ర్ట ప్రభు త్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్  మంజూరు కావడంతో మరో అడుగు ముందుకు వేసిందని  విద్యావంతులు మే ధావులు అభిప్రాయపడుతున్నారు.

వనపర్తి విద్యార్థులు రాష్ర్టస్థాయిలో ప్రతి భ కనబరిచి రాష్ర్ట మొత్తం వనపర్తి వైపు చూస్తుడండం విశేషం.  అలాంటి వనపర్తి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ మంజూ రు కావడంతో విద్యలో మరొక అడుగు ముందుకు వేసినట్లు విశ్లేషకులు విద్యావం తులు మేధావులు అభిప్రాయ పడుతున్నా రు. పేద మధ్య తరగతి విద్యార్థులకు అంత ర్జాతీయ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలకు ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి వనపర్తికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు భవన నిర్మాణం కోసం రూ 100 కోట్లు మంజూరు చేయించిన విషయం సైతం తెలిసిందే. రెసిడెన్షియల్ ఏర్పాటు కోసం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

రెసిడెన్షియల్ పాఠశాల లక్ష్యం ఇలా.. 

జిల్లాలో చాలావరకు గురుకులాలకు శాశ్వత భవనం లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పక్కా భావనం లేనప్పుడు బోధన,  అసభ్యన కార్యక్రమాలు అమలు ఇబ్బందికరంగా ఉంటున్న విషయం  తెలిసిందే. ఇలాంటి ఇబ్బందుల మధ్యలో విద్యార్థులు ఉండవద్దని ఉద్దేశంతో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యా ర్థులను ఒకే గొడుగు కిందకు  తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ గురుకులా లను ప్రభుత్వ నిర్మిస్తోంది. సుమారు 20 నుండి 25 ఎకరాలలో గురుకులాలను ప్రభుత్వ నిర్మించాలన్నదే లక్ష్యం.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌లో విద్యా ప్రమాణాలు మెరు గుపరచడం పరిసరాల అవసరాలకు అను గుణంగా యువ గ్రాడ్యుయేట్లను నిరు ద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా అత్యాధునిక  పరిజ్ఞానాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్లో  విద్యార్థులకు బోధన చేసే విధంగా ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యాబోధనలో అందించనున్నారు.

ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లో తరగతి గదులు డార్మెంటర్లు, ల్యాభోరోటరిలు, క్రికెట్ ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ మైదానా లు, అవుట్డోర్ జిమ్ థియేటర్ వంటి సౌకర్యాలను సైతం కల్పించనున్నారు.

త్వరలోనే నిర్మాణానికి శంకుస్థాపన 

విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను అందించే దిశగా రాష్ర్ట ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్  ఏర్పా టు చేస్తున్న విషయం విధితమే. అందులో భాగంగానే  త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వనపర్తి జిల్లా కేంద్రం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కు సంబంధించి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినందు కు సన్నహాలు జరుగుతున్నాయి.

శంకుస్థా పన పనులు ప్రారంభంగానే త్వరితగతిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యా ర్థులకు విద్యను అందించే దిశగా  కృషి చేస్తు న్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. 

అంతర్జాతీయ విద్య అందించడమే ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ లక్ష్యం 

వనపర్తికి ఇప్పటికే విద్యాపర్తిగా పేరొం ది. అలాంటి విద్యాపర్తిని మరింత అభి వృద్ధి చేయాలన్నదే నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి  ని ప్రత్యేకంగా ఒప్పించి వనపర్తి జిల్లాకు ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్‌ను మంజూరు చేయించడం జరిగింది.

రూ 100 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో భవన ని ర్మాణం జరగనుంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు పాఠశాల ద్వారా అంతర్జా తీయ స్థాయి విద్యను అందించడం లక్ష్యం గా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు 

 తూడి మేఘా రెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు