calender_icon.png 27 September, 2024 | 4:53 AM

వరంగల్ సిగలో మరో మణిహారం

26-09-2024 12:40:18 AM

నైబర్‌హుడ్ ఛాలెంజ్ పోటీల్లో బల్దియాకు ఎక్స్‌లెన్స్ అవార్డు

హనుమకొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ సిగలో మరో మణిహారం చేరింది. మూడేళ్లుగా నిర్వహిస్తున్న నర్సరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ (ఎన్‌ఎన్‌సీ) పోటీల్లో ఇతర నగరాలతో పోటీపడి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి ఐదు నగరాల్లో వరంగల్ నిలి చిందని బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి గృహ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీ లో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మిషన్ డైరెక్టర్ రాహుల్ కపూర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించినట్లు ఎస్ ఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్‌ఎన్‌సీ పోటీల్లో బెం గళూరు, ఇండోర్, జబల్‌పూర్, కొచ్చి నగరాలతో పాటు వరంగల్ మహానగరం చోటు దక్కించుకున్నది.

దీనిపట్ల నగర మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. అవార్డు రావడానికి కృషి చేసిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారుల ను అభినందించారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 100 స్మార్ట్‌సిటీ నగరాలను ఎంపి క చేయగా మొదటి విడతలో భాగంగా నర్సరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ పేరుతో పోటీ లు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యం లో నగర వ్యాప్తంగా ఎంహెచ్ నగర్‌లో చిట్టి పార్క్‌ను 56 గంటల రికార్డు స్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. అదే విధంగా క్రిస్టియన్ కాలనీలో నైనర్హుడ్ పార్క్, కరీమాబాద్‌లో గుండు బావి, శ్రీనగర్ కాలనీలో సేన్సొరి పార్క్, ఎల్‌పీ స్కూల్లో సైన్స్‌పార్క్, అంబేడ్కర్ కూడలి వద్ద బుద్ధ ప్లాజాలను నిర్ధేశిత సమయంలో ఏర్పాటు చేసి డాక్యుమెంటేషన్‌ను ఎంపిక కమిటీకి పంపించినట్లు ఆమె వివరించారు. వాటిని పరిశీలించిన కమిటీ వరంగల్ మహానగరాన్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు.